నైజాంలో “హిట్ 2” కి సాలిడ్ ఓపెనింగ్స్.!

నైజాంలో “హిట్ 2” కి సాలిడ్ ఓపెనింగ్స్.!

Published on Dec 3, 2022 4:00 PM IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. తమ హిట్ ఫ్రాంచైజ్ యూనివర్స్ లో చేసిన ఈ క్రేజీ థ్రిల్లర్ అయితే శేష్ కెరీర్ లో భారీ హైప్ తో వచ్చింది. మరి మొదటి రోజు అయితే ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశారు.

ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే అనుకున్నట్టుగానే సాలిడ్ గా నమోదు అయ్యినట్టు నైజాం డే 1 వసూళ్లు చెప్తున్నాయి. మరి ఈ చిత్రం మొదటి రోజు అయితే 1.9 కోట్ల షేర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది శేష్ కెరీర్ లో మరో హైయెస్ట్ కాగా ఈ వీకెండ్ లో ఈ చిత్రం మరింత సాలిడ్ వసూళ్లు సెట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయితే నాని నిర్మాణం వహిస్తుండగా నెక్స్ట్ సినిమాల్లో తాను కూడా క్రేజీ రోల్ లో నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు