వరల్డ్ వైడ్ “కబ్జ” కి సాలిడ్ ఓపెన్సింగ్.?

Published on Mar 18, 2023 3:00 pm IST

కన్నడ సినిమా నుంచి భారీ అంచనాలు నడుమ వచ్చిన లేటెస్ట్ సినిమా “కబ్జ”. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా బాద్షా కిచ్చా సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించారు. మరి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా అంత మంచి టాక్ రాలేదు కానీ మొదటి రోజు మాత్రం సాలిడ్ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా అయితే మొత్తం 26 కోట్లు వసూలు చేసినట్టుగా కొన్ని పోస్టర్ లు ట్రేడ్ వైరల్ గా మారుతున్నాయి.

కానీ నిజానికి అయితే అసలు ఈ సినిమాకి అంత రేంజ్ వసూళ్లు రాలేదని తెలుస్తుంది. దాదాపు 10 నుచి 12 కోట్ల మేర మాత్రమే వచ్చినట్టుగా టాక్. మరి డిజప్పాయింటింగ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఫైనల్ రన్ లో అయితే ఎలాంటి నంబర్స్ దగ్గర ఈ సినిమా ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించగా రవి బసృర్ సంగీతం అందించాడు. అలాగే ఆర్ చంద్రు మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :