ఓవర్సీస్ లో “కార్తికేయ 2” కి సాలిడ్ ఓపెనింగ్స్.!

Published on Aug 13, 2022 3:00 pm IST

టాలీవుడ్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం “కార్తికేయ 2” కూడా ఒకటి. అనేక ఇబ్బందులు నడుమ నిఖిల్ స్ట్రగుల్స్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పక్కన పెడితే ఓవర్సీస్ లో అయితే రీసెంట్ సినిమాల్లో చాలా మంచి ఓపెనింగ్స్ ని ప్రీమియర్స్ తో అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం జస్ట్ ప్రీమియర్స్ తోనే సుమారు లక్ష డాలర్స్ వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ అందుకుంది చెప్పాలి. పైగా టాక్ కూడా ఆల్రెడీ పాజిటివ్ గా వినిపిస్తుంది. మరి వేచి చూడాలి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పెర్ఫామెన్స్ ను కనబరుస్తుందో అనేది.

సంబంధిత సమాచారం :