హిందీలో “లైగర్” కి ఫస్ట్ డే అదిరే వసూళ్లు నమోదు.!

Published on Aug 27, 2022 12:01 pm IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం “లైగర్” రీసెంట్ గా వచ్చిన పలు సినిమాలకి మించి భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాపై అనుకున్న రేంజ్ లోనే ఓపెనింగ్స్ అయితే తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా వచ్చాయి.

కానీ అంతా హిందీలో ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయి అనే దానికోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి హిందిలో కూడా ఈ చిత్రం ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లనే అందుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా పైడ్ ప్రీమియర్స్ తో కలిపి హిందీలో ఫస్ట్ డే సుమారు 6 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమాకి హిందీలో అదిరే ఓపెనింగ్స్ దక్కినట్టే అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ నెక్స్ట్ డే నుంచి అయితే వసూళ్లు ఎలా ఉంటాయో కూడా తప్పక చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :