“చరణ్ 15” ఫస్ట్ లుక్ రిలీజ్ కి ఊహించని ప్లాన్స్..?

Published on Aug 10, 2022 5:03 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ఇండియాస్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. శంకర్ మరియు రామ్ చరణ్ ల కాంబోలో వస్తున్న 15వ సినిమా ఇది కావడం అలాగే నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రం శంకర్ మార్క్ తో అదిరే ఎలిమెంట్స్ తో ఒక మాసివ్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

దీనితో ఈ భారీ సినిమా పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ నెల ఆగస్ట్ లో అయితే ఈ సినిమా అవైటెడ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా గట్టి బజ్ ఉంది. మరి ఈ లుక్ ని గ్రాండ్ ఈవెంట్ తో శంకర్ ప్లాన్ చేస్తున్నారని కూడా తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ ఈవెంట్ ఇక్కడ గాని దుబాయ్ లో గాని ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతే కాకుండా పలువురు ఊహించని బిగ్ స్టార్స్ కూడా హాజరు అవ్వొచ్చనీ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో
అయితే ఎంతవరకు నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :