ఓవర్సీస్ లో సాలిడ్ గా “ఆచార్య” ప్రీ సేల్స్ కలెక్షన్స్.!

Published on Apr 27, 2022 9:00 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈ మాసివ్ ట్రీట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ ఈ సినిమా యూఎస్ లో మూడు లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లను ప్రీ సేల్స్ తో రాబట్టినట్టుగా ప్రైమ్ మీడియా వారు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ కౌంట్ ఇంకా కొనసాగుతుండగా మరిన్ని లొకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ నాటికి మరింత మంచి నంబర్స్ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చూడాలి ఈ చిత్రానికి ఎంత ప్రీమియర్స్ వసూళ్లు వస్తాయో అనేది.

సంబంధిత సమాచారం :