‘RRR’ బ్రాండ్ కు నెవర్ బిఫోర్ రెస్పాన్స్ అట.!

‘RRR’ బ్రాండ్ కు నెవర్ బిఫోర్ రెస్పాన్స్ అట.!

Published on Sep 23, 2021 11:07 PM IST


ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే ఈ సినిమా నుంచి ఇటీవల తమ బ్రాండ్ నుంచి కొన్ని వస్తువులను మార్కెట్ లోకి వదిలారు. కొన్ని పోస్టర్స్, టీ షర్ట్స్ సహా ఇంకా కొన్ని వస్తువులను అందుబాటులోకి తెచ్చిన మార్కెట్ సంస్థలో ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించి ఏ సినిమాకి రాని రెస్పాన్స్ వచ్చిందట. సౌత్ ఇండియన్ సినిమా నుంచి మార్కెట్ లోకి వచ్చిన 24 గంటల్లో భారీ సేల్స్ అయ్యాయట.

దీనితో ఈ చిత్రం బ్రాండ్ కి ఎంతటి డిమాండ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణం వహించగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు