క్రాస్ రోడ్స్ లో “7/జి బృందావన కాలనీ” కి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Sep 22, 2023 2:00 pm IST

టాలీవుడ్ గత ఏడాది స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో అయితే లేటెస్ట్ గా రీ రిలీజ్ కి వచ్చిన ఓ కల్ట్ క్లాసిక్ చిత్రం “7/జి బృందావన కాలనీ” కూడా ఒకటి. యంగ్ హీరో రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా వెర్సటైల్ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి ఈ చిత్రం మళ్ళీ ఇన్నాళ్ళకి రీరిలీజ్ కి తీసుకురాగా ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరి మెయిన్ గా మాస్ థియేటర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అయితే సినిమా మార్నింగ్ షో నుంచే సాలిడ్ రెస్పాన్స్ నమోదు అయ్యింది. దీనితో మేకర్స్ కూడా ఈ సినిమా రెస్పాన్స్ ని ఆడియెన్స్ కి షేర్ చేసుకున్నారు. థియేటర్స్ లో మళ్ళీ ఇన్నాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా పాటలు సీన్స్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :