“అఖండ” మాస్ జాతరకు కూడా భారీ రెస్పాన్స్.!

Published on Nov 28, 2021 1:10 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మస్సివ్ ఎంటెర్టైనెర్ నిన్ననే భారీ లెవెల్ ప్రీ రిలీజ్ వేడుకని అట్టహాసంగా ముగించుకుంది. అయితే ఈ స్పెషల్ డే సందర్భంగా మేకర్స్ రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా రివీల్ చేసారు.

“జై బాలయ్య” సాంగ్ ఒకటి కాగా ఇంకొకటి అఖండ మాస్ జాతర వీడియోని కొత్త ట్రైలర్ లా రిలీజ్ చేశారు. అయితే దీనికి కూడా ఇపుడు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇద్దరి వెర్షన్ ల బాలయ్యలతో సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేసిన ఈ ట్రైలర్ ముందు వాటిలాగే అదిరే రెస్పాన్స్ ని అందుకుంది.

పెద్దగా ప్లానింగ్స్ లేకుండానే రిలీజ్ చేసినా ఆల్రెడీ 3 మిలియన్ వ్యూస్ ని ఇది క్రాస్ చేసింది. ఓవరాల్ గా మాత్రం అఖండ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :