గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రామబాణం. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో గోపీచంద్ కి అన్నయ్య గా జగపతి బాబు నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, అలానే ఫస్ట్ యారో టీజర్ అందరినీ ఆకట్టుకోగా నిన్న శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్న గోపీచంద్, జగపతి బాబుల స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
కాగా ఈ గ్లింప్స్ ప్రస్తుతం 1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని యూట్యూబ్ లో దూసుకెళుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.