“జైలర్” గ్లింప్స్ సాలిడ్ రెస్పాన్స్.!

“జైలర్” గ్లింప్స్ సాలిడ్ రెస్పాన్స్.!

Published on Dec 13, 2022 8:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి నిన్ననే సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో మేకర్స్ నుంచి ఓ సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా దీనికి అయితే యూట్యూబ్ నుంచి మంచి రెస్పాన్స్ ని అయితే అందుకుంటుంది.

మరి ఈ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ 13 గంటల్లో 31 లక్షలకి పైగా వ్యూస్ ని అందుకోగా 3 లక్షల మేర లైక్స్ ని రాబట్టేసింది. దీనితో ఈ చిత్రం పై అయితే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
 

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు