శేష్ “మేజర్” ప్రీ ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్..!

Published on May 24, 2022 3:34 pm IST

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “మేజర్”. దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ జూన్ 3న విడుదల అవుతుంది. అయితే దానికన్నా ముందే ఒక పది రోజులు ముందే మన దేశంలో కొన్ని చోట్ల ప్రాంతాలను సెలెక్ట్ చేసి అక్కడ ఇది వరకు ఏ ఇండియన్ సినిమాకి చెయ్యని విధంగా ప్రీ స్క్రీనింగ్ షోస్ ని ప్లాన్ చేశారు.

అయితే ఇలా ప్లాన్ చేసినట్టుగా నిన్న అనౌన్స్ చెయ్యగా ఇప్పుడు వాటి బుకింగ్స్ కి గాను సాలిడ్ రెస్పాన్స్ వస్తుందట. ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని మేకర్స్ అంటున్నారు. అలాగే ఈ రెస్పాన్స్ తో వారు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమాపై మంచి హైప్ ఉందని చెప్పాలి. మరి ఈ సినిమా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కగా మహేష్ బాబు అలాగే సోనీ పిక్చర్స్ ఇండియా వారు నిర్మాణం వహించారు. అలాగే మరిన్ని ప్రదేశాల్లో డిమాండ్ మేర ఈ షోస్ ప్లాన్ చేస్తున్నట్టు అడివి శేష్ కన్ఫర్మ్ చేసాడు.

సంబంధిత సమాచారం :