నితిన్ “మాచర్ల నియోజకవర్గం” ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Jul 31, 2022 8:03 am IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎడిటర్ టర్న్డ్ దర్శకునిగా మారిన ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మాస్ చిత్రం మంచి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది.

ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని అయితే మేకర్స్ విడుదల చెయ్యగా దానిని మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. ఇక ఈ ట్రైలర్ లేటెస్ట్ గా అయితే 11 గంటల్లోనే 7 మిలియన్ కి పైగా వ్యూస్ క్రాస్ చేసి సాలిడ్ రెస్పాన్స్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంది.

మరి 24 గంటల్లో అయితే ఈ ట్రైలర్ ఎక్కడ మార్క్ దగ్గర ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందించగా వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఆగస్ట్ 12న రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :