యూఎస్ గడ్డపై “ఆది” స్పెషల్ షోకి భారీ రెస్పాన్స్.!

Published on May 22, 2022 9:00 am IST


మన టాలీవుడ్ మాసెస్ట్ హీరోస్ లో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ మే 20న అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా చేసారో తెలిసిందే. అయితే మన దగ్గర మాత్రమే కాకుండా యూఎస్ దేశంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇది వరకు మన తెలుగులో ఏ హీరోకి కూడా చెయ్యని విధమైన రచ్చ చేసి తమ అభిమాన హీరోపై ప్రేమను చాటుకున్నారు.

అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డల్లాస్ లోని గాలెక్సీ గ్రాండ్ స్కేప్ వద్ద ఎన్టీఆర్ నటించిన వింటేజ్ భారీ హిట్ ఆది సినిమా స్పెషల్ షో వేయించుకోగా మూడు షోలకి మూడు కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయని తెలుస్తుంది. దీనితో ఆ థియేటర్ లో అభిమానులు చేసిన రచ్చ, కోలాహలం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :