“రాధే శ్యామ్” హిందీ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jan 8, 2022 12:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ లవ్ స్టోరీ కోసం ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ కరోనా వల్ల మళ్ళీ ఈ సినిమా రిలీజ్ కి బ్రేక్ పడడం తప్పలేదు.

అయితే ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యిపోయింది అని మేకర్స్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేసేసారు. కానీ ఫైనల్ గా మాత్రం రిలీజ్ ఆగక తప్పలేదు. అయితే ఈ సినిమాపై మన తెలుగులో ఆడియెన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో బాలీవుడ్ ఆడియెన్స్ కూడా అంతకు మించిన స్థాయిలో ఎదురు చూస్తున్నారని ఆల్రెడీ ఈ సినిమా పాటలు, ట్రైలర్ రెస్పాన్స్ లతో ఒక క్లారిటీ వచ్చింది.

మరి లేటెస్ట్ గా రాధే శ్యామ్ హిందీ ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ అందుకొని మరో సెన్సేషనల్ మార్క్ ను అందుకుంది. దీనితో హిందీలో 1 మిలియన్ లైక్స్ కలిగిన మరో ట్రైలర్ గా ప్రభాస్ ఖాతాలో ఈ రికార్డు పడింది. దీనిని బట్టే ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ రాధే శ్యామ్ కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :