హిందీలో “ఖిలాడి” ట్రైలర్ కి భారీ రెస్పాన్స్..!

Published on Feb 9, 2022 7:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి” ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. తన లాస్ట్ సినిమా “క్రాక్” తో సాలిడ్ హిట్ అండ్ కం బ్యాక్ అందుకున్నాక చేసిన సినిమా ఇది కావడంతో “ఖిలాడి” పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఊహించని రీతిలో తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీనితో ఈ చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ హిందీ రిలీజ్ కి సిద్ధం చేసి దాని నుంచి కూడా ట్రైలర్ ని హిందీలో రిలీజ్ చెయ్యగా దానికి అనూహ్య స్పందన రావడం విశేషం. 24 గంటల్లో ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ఏకంగా 7 మిలియన్ మేర దగ్గర వ్యూస్ వచ్చేసాయి. దీనితో ఖిలాడి రిలీజ్ పై మరింత హోప్ హిందీలో వచ్చిందని చెప్పాలి.

మరి ఇది థియేట్రికల్ గా కూడా సక్సెస్ అయితే గనుక మాస్ మహారాజ్ నుంచి మరిన్ని సినిమాలు హిందీలో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్సకత్వం వహించగా ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :