లేటెస్ట్..ఓటీటీ లోకి వచ్చేసిన సాలిడ్ థ్రిల్లర్ “విరూపాక్ష”.!

Published on May 21, 2023 7:01 am IST

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ రెవెన్యూస్ ఇచ్చిన చిత్రాల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” కూడా ఒకటి. మరి ధరమ్ తేజ్ సెకండ్ లైఫ్ నుంచి వచ్చిన మొదటి సినిమాగా ఇది రాగా తన కెరీర్ లోనే పెద్ద హిట్ అవ్వడమే కాకుండా తన కెరీర్ లో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

మరి ఇప్పటికీ థియేట్రికల్ గా బాగానే రన్ అవుతూ ఆల్మోస్ట్ రన్ చివరికి రాగా ఫైనల్ గా అయితే ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈరోజు నుంచి అయితే అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా చూడాలి అనుకునే వారు ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం :