“బిగ్ బాస్ 5” గ్రాండ్ ఫినాలేకి సాలిడ్ రేటింగ్..టోటల్ ఎంతంటే.!

Published on Dec 30, 2021 3:35 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో గత కొన్ని రోజులు కితమే ఐదవ సీజన్ ని కూడా ఎంతో అట్టహాసంగా ముగించుకుంది. మరి ఈ రసవత్తర వాతావరణంలో ఈ సారి సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనేది రాగా మంచి అంచనాలు దీనిపై నెలకొన్నాయి. ఇక దానికి తగ్గట్టు గానే ఏ ఎపిసోడ్ ని మేకర్స్ చాలా గ్రాండ్ ఏకంగా బాలీవుడ్ సెలెబ్రెటీలను కూడా తీసుకొచ్చి ప్లాన్ చేశారు.

మరి ఇన్ని హంగులు నడుమ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ లో టాప్ 2 సన్నీ, షన్ను దగ్గరకి వచ్చేసరికి మరింత టెన్స్ వాతావరణం నెలకొంది. ఇలా ఈ ఎగ్జైటింగ్ ఎపిసోడ్ లో సన్నీ విన్నర్ గా నిలిచాడు. మరి ఈ ఆసక్తికర ఎపిసోడ్ కి ఎంత రేటింగ్ వచ్చింది అనేది ఇప్పుడు తెలిసింది. ఈ సారి సీజన్ కి గాను 18.4 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. దీనితో గడిచిన ఈ ఐదు సీజన్లలో ఇది టాప్ 3లో ఒకటిగా నిలిచింది. మొత్తానికి మాత్రం ఈసారి సీజన్ కూడా బ్లాక్ బస్టర్ గానే నిలిచింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :