శేష్ “గూఢచారి 2” నుంచి సాలిడ్ అప్డేట్.!

శేష్ “గూఢచారి 2” నుంచి సాలిడ్ అప్డేట్.!

Published on Dec 29, 2022 12:09 PM IST

మన టాలీవుడ్ లో మంచి థ్రిల్లర్ సినిమాలకి గాను కేరాఫ్ అయ్యినటువంటి అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ కూడా ఒకడు. మరి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో పాటుగా తన కెరీర్ మరో క్రేజీ హిట్ గూఢచారి సీక్వెల్ “గూఢచారి 2” కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ చిత్రాన్ని “జీ2” గా ప్రెజెంట్ చేస్తూ ఈ సినిమా తాలూకా “ప్రీ విజన్” వీడియో ని ఈ జనవరి 9 న ఢిల్లీ మరియు ముంబై లలో లాంచ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి పాన్ ఇండియా వైడ్ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్న శేష్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రానికి కూడా కథను శేష్ నే అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు