“బాలయ్య 108” పై మేకర్స్ నుంచి అదిరే అప్డేట్.!

Published on Jun 3, 2023 2:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా చేస్తుండగా భారీ అంచనాలు ఈ చిత్రంపై అయితే నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ అయితే ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని ఫ్యాన్స్ కి అందించారు.

ఈ జూన్ లో బాలయ్య బర్త్ డే కానుకగా అదిరే ట్రీట్ లు రెడీగా ఉన్నాయి అంటూ మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. అన్న వస్తుండు అంటూ మాస్ ఈ బర్త్ డే కి మామూలుగా ఉండదు అంటూ అప్డేట్ అందించారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం థమన్ అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :