‘గేమ్ ఛేంజర్’ సాలిడ్ అప్డేట్.. టీజర్ డేట్ లాక్!

‘గేమ్ ఛేంజర్’ సాలిడ్ అప్డేట్.. టీజర్ డేట్ లాక్!

Published on Oct 31, 2024 5:50 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి పొలిటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను మేకర్ర్స ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీజర్‌కి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్ర టీజర్‌ని నవంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ రైల్వే ట్రాక్‌పై కూర్చున్న పోజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు