“హిట్ 2” పాన్ ఇండియా రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

“హిట్ 2” పాన్ ఇండియా రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Nov 23, 2022 11:26 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “హిట్ 2” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఈరోజు వచ్చిన ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉండగా దీనితో ఒక్కసారిగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ పై అయితే హీరో శేష్ లేటెస్ట్ గా ఓపెన్ అయ్యాడు. ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కోసం తనకి సంప్రదింపులు వస్తున్నాయని తమ ప్రొడ్యూసర్ నాని తో అయితే మాట్లాడి పాన్ ఇండియా రిలీజ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే హిందీలో ఆల్రెడీ హిట్ మొదటి సినిమా రీమేక్ అయ్యింది. మరి దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు