తారక్, నీల్ భారీ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాలు “దేవర” (Devara), “వార్ 2” (War 2) ల కోసం తెలిసిందే. మరి ఈ చిత్రాలపై పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఈ చిత్రాలు తర్వాత తారక్ చేయనున్న సినిమాల్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా ఒకటి. మరి ఇద్దరు మాస్ బాంబ్స్ కలిస్తే ఆ విస్ఫోటనం ఎలా ఉంటుందో ఊహించలేనిది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు మిన్నంటాయి.

మరి ఈ కాంబినేషన్ లో సినిమా నిజానికి ఈ పాటికే షూట్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఇతర కారణాల చేత అది వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రం ఈ ఏడాదిలో అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోనుందట. అలాగే ఈ సినిమాని అనుకున్న దానికంటే మరింత గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఏ స్థాయిలో వస్తుంది అనేది.

Exit mobile version