“కాంతారా” ఇంగ్లీష్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

“కాంతారా” ఇంగ్లీష్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Dec 7, 2022 9:00 AM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ డివోషనల్ హిట్ చిత్రం “కాంతారా”. మరి కన్నడ మరియు తెలుగు సహా హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం హిందీ వెర్షన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కాగా నెక్స్ట్ అయితే గత కొన్ని రోజుల కితమే కాంతారా ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది అని టాక్ వచ్చింది.

మరి ఫైనల్ గా ఈ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ చెయ్యనున్నారట. మరి ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే దీనిపై రిలీజ్ డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది. అలాగే ఇంగ్లీష్ లో వచ్చాక అయితే గ్లోబల్ గా ఈ సినిమాకి ఎలాంటి రీచ్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు