“సూర్య 42” పై సాలిడ్ అప్డేట్.!

Published on Feb 6, 2023 6:24 pm IST

స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే. దర్శకుడు శివ తో సూర్య తన కెరీర్ లో చేస్తున్న 42వ సినిమా ఇది కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. మరి సినిమా అనౌన్సమెంట్ చేసినప్పుడే ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేయడంతో ఓ రేంజ్ లో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ గావిస్తుంది. మరి ఇప్పుడు సినిమా షూట్ పై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ప్రస్తుతం మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని సూర్య పై తెరకెక్కిస్తున్నారట. అలాగే నెక్స్ట్ కూడా యాక్షన్ సీక్వెన్స్ నే ప్లాన్ చేస్తుండగా దీనికి భారీ విమానం సెట్ వర్క్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమాలో యాక్షన్ పార్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా నుంచి సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఫ్యాన్స్ కి గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :