నితిన్ “మాచర్ల నియోజకవర్గం” నుంచి సాలిడ్ అప్డేట్.!

Published on Mar 24, 2022 10:09 am IST


మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “మాచర్ల నియోజకవర్గం” కోసం తెలిసిందే. నితిన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ఒక పొలిటికల్ డ్రామాగా కనిపించనుంది. అయితే ఈ సినిమా నుంచి నిన్ననే మేకర్స్ కీలక అప్డేట్ ని రివీల్ చేశారు.

ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి కీలక అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి దీనిని ఇప్పుడు రివీల్ చేసేసారు. ఈ చిత్రం నుంచి నితిన్ తాలూకా సాలిడ్ పోస్టర్ ని ఈ మార్చ్ 26 న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసినట్టు ప్రెస్ నోట్ తో రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే పాత్రలో ఒక పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా రానున్నాడని తెలిపారు. మరి ఈ సరికొత్త లుక్ లో నితిన్ ఎలా ఉంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :