రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” నుంచి సాలిడ్ అప్డేట్స్.!

Published on Mar 31, 2022 10:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో తన పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ మాస్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకరు. అయితే దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ అయ్యినప్పుడే భారీ హైప్ ని తెచ్చుకుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు సాలిడ్ అప్డేట్స్ ని ఇచ్చారు.

అయితే ఈ చిత్తరం నుంచి మేకర్స్ ఈ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకి ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చెయ్యడమే కాకుండా ఆరోజే సినిమాకి ముహూర్తం కూడా ముహూర్తం పెట్టనున్నట్టు తెలియజేసారు. ఈ సినిమాని టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ స్కేల్ లో తెరకెక్కిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :