ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల జీవితం ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కించడం కూడా ఇటీవల ట్రెండ్ గా మారింది. ఇప్పటికే ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చి వారి వారి అభిమానులను అలరించాయి.
అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి సింధు జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసందే. కాగా ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. అయితే ఇటీవలే సింధు సాధించిన ఘనతలను కూడా ఆమె బయోపిక్ లో భాగం చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
ఇక ఈ సినిమాకు సోనూసూద్ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.
