‘బిగ్ బాస్ 5’..ఆమె విషయంలో నాగ్ పై కామెంట్స్.!

Published on Sep 26, 2021 11:00 am IST

ఇప్పుడు తెలుగు గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా నిన్న ప్రతీ వీకెండ్ లా నిన్న కూడా నాగ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫన్ జెనరేట్ చేసాడు. సరే ఇది పక్కన పెడితే ఓ విషయంపై మాత్రం నాగ్ విషయంలో చిన్న కామెంట్స్ ఇపుడు వస్తున్నాయి. గత వారం రవి మరియు లహరిలా విషయంలో నటి ప్రియా చేసిన కామెంట్స్ ఓ రేంజ్ హీట్ జెనరేట్ చేసాయి.

అయితే ఈ అంశంలో ఆమె రైజ్ చేసిన పాయింట్ బాగుంది కానీ చెప్పిన విధానంపై నాగ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అన్నది తనపై వస్తున్న కామెంట్. లహరి పై ప్రియా కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి.. దానిపై నాగ్ ఎందుకు తనని ప్రశ్నించలేదు అలా ఆమె మాట్లాడకూడదు కదా అనేది అసలు విషయం. అందుకే ఇప్పుడు నాగ్ హోస్టింగ్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :