‘అన్ స్టాపబుల్ 2’ విత్ ఎన్ బికె – పవన్ ఎపిసోడ్ లో ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు

Published on Jan 31, 2023 2:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఎంతో భారీ వ్యయంతో నిర్మిన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దీనితో పాటు సుజీత్ తో ఒక మూవీ అలానే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు చేయనున్నారు పవన్. ఇక తొలిసారిగా ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్ బికె యొక్క తాజా ఎపిసోడ్ కి గెస్ట్ గా విచ్చేసారు పవన్ కళ్యాణ్. రెండు ఎపిసోడ్స్ గా దీనిని ప్రసారం చేయనున్నారు. ఫిబ్రవరి 3న తొలి ఎపిసోడ్ ని అలానే ఫిబ్రవరి 10న రెండవ ఎపిసోడ్ ని ప్రసారం చేయనున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన పవన్ ఎపిసోడ్స్ యొక్క ప్రోమో టీజర్ అందరినీ ఆకట్టుకుని ఫుల్ ఎపిసోడ్స్ పై మంచి ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లైఫ్ లో కీలకమైన మూడు పెళ్లిళ్ల అంశంతో పాటు ఆయన యాక్టింగ్ నేర్చుకోవడానికి వదిన సురేఖ గారు, అలానే అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నం గారు ఎంతో ప్రోత్సహించిన విషయాలు వంటివి ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. అలానే విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో బస్ పై డ్యాన్స్ చేయాల్సిన సందర్భం వంటి ఎవరికీ తెలియని మరికొన్ని విషయాలను ఆయన వెల్లడించారు. మొత్తంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్ బికె షో లో తన లైఫ్ లో ఎదురైనా ఒడిదుడుకులను పంచుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :