సోము వీర్రాజు సమర్పణలో లక్ష గ్రంధాలు ఒకేసారిఆవిష్కరణ!

Published on Apr 8, 2022 7:00 am IST

అద్భుత రచయిత పురాణపండ శ్రీనివాస్ రూప కల్పన.

విశాఖపట్నం : ఏప్రిల్ : 7

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శ్రీరామనవమి సందర్భంగా ఒక అద్భుతమైన భక్తిపూర్వక రసవత్తర ఘట్టానికి విశాఖపట్నం లో తెరలేపనున్న సంకల్పాన్ని రాష్ట్రవ్యాప్తంగా బి.జె.పి. శ్రేణులు ఏక స్వరంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జేజేలు పలుకుతున్నాయి.

సుమారు వంద పేజీలతో ఒక అపురూపపు పవిత్ర గ్రంధాన్ని ‘ శ్రీరామరక్ష ‘ పేరిట ఒకేసారి లక్షప్రతులను ఆవిష్కరించి విశాఖవాసులకు ఉచితంగా అందించనున్నట్లు భారతీయ జనతాపార్టీ శ్రేణులు ప్రకటించాయి.

ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కు ఈ పవిత్రగ్రంధ రచనాసంకలన బాధ్యతలను అప్పగించారు.

తెలుగునాట పురాణపండ శ్రీనివాస్ పవిత్రగ్రంధశోభ గురించి, ఆయన రచనా సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదని, గ్రంథ సొగసుల్లో శ్రీనివాస్ ది అందెవేసిన చెయ్యి అనేది మేధో సమాజానికి ఎరుకే.

సుమారు పది అమోఘమైన స్తోత్రాలతో , అందమైన వ్యాఖ్యానాలతో రూపుదిద్దుకున్న ఈ పుణ్యగ్రంధం లక్షప్రతులను సోము వీర్రాజు సమర్పణలో హైందవసమాజానికి శ్రీరామనవమి పర్వదినంనాడు ఆవిష్కరించి అందించడం ఆయన అధ్యక్షుడుగా వున్నా ఈ సమయంలో ఒక మేలిమలుపు ఘట్టంగానే పేర్కొనాలని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతలు కూడా ఉత్సాహంగా ప్రకటించడం విశేషం.

ముఖపత్రంపై ఆంజనేయస్వామివారు రామలక్ష్మణులను భుజాలకెత్తుకున్న ఫోటో ఆకర్షణీయంగా ముద్రించగా, వెనుకవైపు భారతప్రధాని నరేంద్రమోడీ , భారతీయ జనతాపార్టీ జాతీయ అధక్షుడు నడ్డా, కేంద్రపర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చిత్రాలతోపాటు ఈ సుందర గ్రంథ ప్రచురణకర్త సోము వీర్రాజు ఫోటో కూడా ఆకర్షణీయంగా ముద్రించబడటం విశేషం.

ఆధ్యాత్మిక ధార్మిక గ్రంధాల రచనలో, ప్రచురణలో తెలుగునాట తొలివరుసలో దూసుకుపోతున్న పురాణపండ శ్రీనివాస్ రూపుదిద్దిన ఈ గ్రంధం విశాఖవాసులకు శ్రీరామ చంద్రుని అనుగ్రహమేనని ఆరెస్సెస్ , విశ్వహిందుపరిషద్ ప్రతినిధులు సైతం సోము వీర్రాజుని అభినందిస్తున్నారు.

ఏదిఏమైనా ఒకేసారి లక్ష బుక్స్ ఆవిష్కరించి ఈరోజుల్లో ఉచితంగా ఇవ్వడం మామూలు విషయం కాదు. అంతా అయోధ్య రాముడి అనుగ్రహం, నరేంద్రమోడీ ప్రోత్సాహం, పురాణపండ శ్రీనివాస్ అద్భుత వ్యాఖ్యాన వైఖరీదక్షతలేనని సోము సంతోషాన్ని పంచుకుంటున్నారు. ప్రార్థనకు చక్కని మార్గదర్శనం చేసే పరమ గురువులాంటి ఈ బుక్ ఒక సమృద్ధిమంత్ర బాండాగారమే ! నో డౌట్ . ఎన్నో స్తోత్రాలు వైభవం, ఎంతెంతో అద్భుతమైన వ్యాఖ్యానాల ప్రాభవం ఈ పుస్తకాన్ని మనముందు ఒక అఖండ తేజోరాశిగా ఆవిష్కరిస్తాయి.

సంబంధిత సమాచారం :