సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!

Published on May 10, 2022 3:03 am IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది. స్టార్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ విభిన్నమైన కథలను ఎంచుకొని తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. చేతికి డైమండ్ రింగ్ తో పక్కన కాబోయే భర్తతో నిలబడి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. అయితే తనకు కాబోయే వాడి ముఖాన్ని మాత్రం సోనాక్షి చూపించలేదు.

“ఇది నాకు బిగ్ డే.. ఈ రోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానని” అని రాసుకొచ్చింది. అయితే గత కొన్నిరోజుల నుంచి సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ తో డేటింగ్ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆ వరుడు జహీర్‌ ఇక్బాల్‌ అని అంతా అనుకుంటున్నారు. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :