సోనాక్షి ఫాదర్ విషయంలో జరిగింది అదే

సోనాక్షి ఫాదర్ విషయంలో జరిగింది అదే

Published on Jul 1, 2024 4:30 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ ను రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి శత్రుఘ్న సిన్హాకి ఇష్టం లేదు అని రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఐతే, అసలు శత్రుఘ్న సిన్హాకి ఏమైంది ?, ఎందుకు ఆయన ఆసుపత్రిలో చేరారు అనే విషయాల పై క్లారిటీ వచ్చింది.

శత్రుఘ్న సిన్హా ప్రమాదవశాత్తూ ఇంట్లో సోఫాలో నుంచి లేస్తుండగా కిందపడ్డారు. దీంతో ఆయన పక్కటెముకకు బాగా గాయమైందని టాక్. అందుకే, శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు అని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుంది అని తెలుస్తోంది. కాకపోతే, శత్రుఘ్న సిన్హాకు ప్రస్తుతం జ్వరం ఉందట. అన్నట్టు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి శత్రుఘ్న సిన్హా ఇష్టమే అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు