“ఎఫ్ 3” లోకి అఫీషియల్ గా ల్యాండ్ అయిన సోనాల్ చౌహాన్

Published on Oct 21, 2021 8:21 pm IST


వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రిన్ లు ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఎఫ్3. ఈ చిత్రం 2019 లో వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం లోకి బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ అఫీషియల్ గా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో తను భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.

ఎఫ్ 3 చిత్రం లో భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్ లకు థాంక్స్ చెబుతూ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ లతో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సోనాల్ చౌహాన్ చేసిన పోస్ట్ పై దర్శకుడు అనిల్ రావిపూడి రిప్లై ఇస్తూ, ఎఫ్ 3 కుటుంబం లోకి స్వాగతం అని అన్నారు. నువ్వు ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి టాలీవుడ్ లో వరుస హిట్ చిత్రాలతో దూసుకు పోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :