పుష్ప సక్సస్ పార్టీకి సిద్ధంగా ఉండండి – సోనూ సూద్

Published on Dec 16, 2021 6:25 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఇటు అల్లు అర్జున్ కి అటు సుకుమార్ కి ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో అభిమానులు, సినీ ప్రముఖులు సినిమా భారీ విజయం సాధించాలి అంటూ చెప్పుకొస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప ఘన విజయం సాధించాలి అని కోరుకుంటున్నా బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కి తెలిపారు. ఈ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.పుష్ప సక్సెస్ పార్టీ కి సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :