రియల్ హీరో సోనూసూద్‌కు ‘బిజినెస్‌ టైమ్స్‌ అవార్డు’..!

రియల్ హీరో సోనూసూద్‌కు ‘బిజినెస్‌ టైమ్స్‌ అవార్డు’..!

Published on May 31, 2022 2:30 AM IST

సోనూసూద్.. ఈ పేరు గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కరోనా కష్టకాలం నుంచి పలు ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల మనసులో చెరగని ముద్రని వేసుకుంటున్నాడు.

అయితే తాజాగా సోనూసూద్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది వలస కార్మికులకు సహాయం చేసిన బాలీవుడ్‌ హీరో సోనూసూద్‌ ఒడిశాలో టైమ్స్‌ బిజినెస్‌ ఆవార్డును హైటెక్‌ మెడికల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.తిరుపతి పాణిగ్రాహి చేతుల మీదుగా ఆదివారం అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఒడిశా ప్రభుత్వ ఆర్థికశాఖ ప్రిన్సిపాల్‌ కార్యదర్శి విశాల్‌ దేవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి మనోజ్‌ కుమార్‌ మిశ్రా, ఒడిశా ఆర్సలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా డైరెక్టర్‌ టి.ఎస్‌.షన్‌బోగే తదితరులు హాజరయ్యారు. అనంతరం సీఎం నవీన్‌ పట్నాయక్‌ సోనూసూద్‌ను సన్మానించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు