ఐటీ రైడ్స్ తర్వాత సోనూసూద్ పోస్ట్ చూడాల్సిందే.!

Published on Sep 20, 2021 5:00 pm IST


గత కొన్ని రోజులు కితం నుంచి రియల్ హీరో సోనూసూద్ పై ఐటీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోను సూద్ 20 కోట్ల మేర పన్ను కట్టకుండా ఎగవేశాడని వచ్చిన వార్త సోను సూద్ పై అప్పుడు వరకు తాను చేసిన మంచికి మచ్చలా మారింది. దీనితో సోనూసూద్ పై ఒక్కసారిగా నెగిటివిటి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ నాలుగు రోజులు తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టడం జరిగింది.

నేను నా దేశంలో ఉన్న ప్రజలకి సేవని అందిస్తానని హృదయపూర్వకంగా అనుకున్నానని, నా ఫౌండేషన్ లో ప్రతీ ఉన్న ప్రతీ రూపాయి కూడా మీ సేవ కోసమే ఎదురు చూస్తుంది అని సందేశం ఇచ్చాడు అంతే కాకుండా నేను యాక్ట్ చేస్తున్న యాడ్స్ నుంచి వస్తున్న డబ్బును కూడా సేవ కోసమే వినియోగిస్తున్నానని తెలిపాడు.

అలాగే లాస్ట్ 4 రోజులుగా కొంతమంది గెస్టులు రావడం మూలాన బిజీగా ఉండి తన సేవలను అందించలేకపోయానని ఇక ఈరోజు నుంచి మళ్ళీ సోనూసూద్ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నానని, ఇది మాత్రం కొనసాగుతుంది తనదైన శైలిలో సోనూసూద్ పోస్ట్ చేసాడు. దీనితో పలువురు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఇంకా నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :