హోస్ట్‌గా మారబోతున్న రియల్ హీరో సోనూసూద్..!

Published on Feb 9, 2022 2:00 am IST

కరోనా కష్టకాలం ప్రారంభమైనప్పటి నుంచి పలు ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనూసూద్‌ ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్నాడు.

అయితే త్వరలో మీ అందరికీ ఫన్, మస్తీ అందించేందుకు అడ్వెంచరస్ షోతో మీ ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సోనూసూద్ చెప్పుకొచ్చాడు. రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా.. నా జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ అని తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిగా మెప్పిస్తూ వస్తున్న సోనూ హోస్ట్‌గా ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :