రియల్ హీరో సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం..!

Published on Apr 9, 2022 1:17 am IST

సోనూసూద్.. ఈ పేరు గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కరోనా కష్టకాలం నుంచి పలు ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల మనసులో చెరగని ముద్రని వేసుకుంటున్నాడు.

అయితే తాజాగా సోనూసూద్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గౌరవార్థవంగా యూఏఈ గోల్డెన్‌ వీసాను అందించింది. ప్రముఖ పెట్టిబడిదారులు, వ్యవస్థాపకులు, ఏదైనా రంగంలో నిపుణులకు మాత్రమే ఈ వీసా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దుబాయ్‌ గోల్డెన్‌ వీసాను అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్‌ కూడా ఒకటని, ఇది అభివృద్ధి చెందడానికి అద్భుతమైన చోటు అని సోనూసూద్ అన్నాడు.

సంబంధిత సమాచారం :