విలన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సోనూసూద్..!

Published on Dec 24, 2021 12:32 am IST


బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఇప్పటివరకు విలన్‌గానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ తాజాగా హీరోగా టర్న్ తీసుకున్నాడు. జీ స్టూడియోస్‌, శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌, ఫర్హాద్‌ సంజీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఫతేహ్‌’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్‌లో ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాలకు అస్టిస్టెంట్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అభినందన్‌ గుప్తా ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నారు.

ఇండియాలోని ఓ శత్రువుపై చేస్తున్న వన్‌ మ్యాన్‌ పోరాటమే ‘ఫతేహ్‌’. మరింత యాక్షన్‌తో 2022 ఏడాదిని స్వాగతిస్తున్నానని, స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులో భాగస్వామ్యం కావాలని అనుకున్నానని సోనూసూద్ అన్నారు. ఇదిలా ఉంటే కరోనా సమయం నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వస్తున్న సోనూసూద్ రియల్ లైఫ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు రీల్ విలన్ నుంచి రీల్ హీరోగా మారుతున్న సోనూసూద్ హీరోయిజాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :