రియల్ హీరో సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం..!

Published on Aug 2, 2021 9:00 pm IST

కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ సోనూలా కనిపిస్తున్నాడు. అయితే తాను చేస్తున్న సేవలకు ఇప్పటికే ఎన్నో సత్కారాలు అందుకున్న సోనూకు తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.

రష్యాలోని కజాన్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. అయితే ఈ స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో భాగంగా భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన సోనూసూద్ స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ భారత జట్టు తరపున నిలబడడం సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం :