త్వరలో తర్వాతి సినిమాను ప్రకటించనున్న శేఖర్ కమ్ముల !

Sekhar Kammula

‘ఫిదా’ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంకా తన తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా ప్రకటించలేదు. సినీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం ఆయన కొత్త సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారని, ఇంకో నెలలో చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా కొత్త నటుడ్ని, స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తుండటం. మరి ఈ సినిమాని కూడ ఆయన ‘ఫిదా’ స్థాయిలో ఉండేలా రూపొందిస్తారేమో చూడాలి.

Exit mobile version