ఆకట్టుకుంటున్న ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్

ఆకట్టుకుంటున్న ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్

Published on Dec 20, 2022 6:44 PM IST


ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. కాగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి సోల్ ఆఫ్ వారసుడు సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. హృద్యమైన ఎమోషన్స్ తో ప్రముఖ గాయని చిత్ర ఎంతో అద్భుతంగా పాడిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గొప్ప సాహిత్యాన్ని అందించగా థమన్ మంచి ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో బాగా వ్యూస్, లైక్స్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు