శ్రీవల్లి సిగ్నేచర్ మూమెంట్ చేసిన సౌరవ్ గంగూలీ

Published on Mar 24, 2022 7:28 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం లోని డైలాగ్స్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. సెలబ్రిటీ లు సైతం స్టెప్పులు వేస్తూ అనుకరిస్తూ అభినందించారు. అయితే ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మాజి టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేరిపోయారు.

దాదా గిరి అన్ లిమిటెడ్ కార్యక్రమం లో తాజాగా శ్రీవల్లి సిగ్నేచర్ మూమెంట్ ను చేశారు గంగూలీ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఎంతోమంది క్రికెటర్లు సైతం వేసిన ఈ మూమెంట్, మరోసారి గంగూలీ వేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :