ఫ్యాషన్ షూట్ కోసం సౌత్ ఇండియా సెలబ్రిటీస్ శ్రీలంకకు… ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంకన్ ఎయిర్ లైన్స్!

Published on Apr 3, 2022 2:00 pm IST

దేశ పర్యాటక పునరుద్దరణ కి మద్దతు ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూ, భారతదేశం తో బంధాన్ని మరింత పటిష్టం చేస్తూ శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ఇండియా లోని ప్రముఖ నటీనటులకు మరియు వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూ ట్యూబర్స్ తో కూడిన, ముఖ్యం గా సౌత్ ఇండియా కి చెందిన ఒక టీమ్ శనివారం, మార్చ్ 26 న కొలంబో చేరుకున్నారు. ఈ టీమ్ అక్కడ ఆరు రోజుల పాటు ప్రయాణం చేయడం జరిగింది.

తమ టాలెంట్ తో, ట్రావెల్ వీడియోస్ ద్వారా దేశ వ్యాప్తంగా లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్న అవికా గోర్, గెహ్న సిప్పి, అపూర్వ శ్రీనివాసన్, రుహని శర్మ, తాన్యా హోప్, మరియు మనోజ్ కుమార్ కాటోకర్ లు ఈ టీమ్ లోని సభ్యులు గా ఉన్నారు. ట్రిప్ మొత్తం సిన్నమోన్ బెంటోటా బీచ్ లో ఉండి, అక్కడి నుండి దగ్గర లోని ప్రాంతం చూడతగిన ప్రాంతాలకు ఈ టీమ్ వెళ్తుంది. అంతేకాక అక్కడి ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం ను ఈ టీమ్ సందర్శించడం జరిగింది. అక్కడి ప్రాపర్టీస్ లోనే ఈ టీమ్ తో, మై సౌత్ దివా తమ వార్షిక క్యాలెండర్ ను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

సంబంధిత సమాచారం :