కేరళ మార్కెట్ పై దృష్టి పెట్టిన దక్షిణాది స్టార్ హీరో !

21st, June 2017 - 01:38:35 PM


దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కేవలం తమిళనాట మాత్రమే కాక ఇతర రాష్ట్రాల్లో సైతం తన మార్కెట్ పరిధిని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ఆయన చేస్తున్న ‘వివేగం’ చిత్రంతోనే ఆ పని మొదలుపెట్టాడు అజిత్. ఈ చిత్రాన్ని కేరళలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ములకుప్పడం ఫిలిమ్స్ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

దీంతో సినిమాకు ప్రమోషన్లు, భారీ స్థాయి రిలీజ్ లభించి మంచి ఓపెనింగ్స్ దక్కి కేరళలో అజిత్ మార్కెట్ మునుపటి కంటే మెరుగయ్యే అవకాశముంటుందని సినీ విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే ‘వీరం’ ఫేమ్ శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ ‘సుర్వివ’ రెండు రోజుల క్రితమే విడుదలై బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అజిత్ కు జోడీగా కాజల్ నటిస్తుండగా సినిమాని ఆగష్టు 10న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.