నాగ శౌర్య నెక్స్ట్ కి సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.!

నాగ శౌర్య నెక్స్ట్ కి సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.!

Published on Nov 4, 2022 1:58 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ డెడికేటెడ్ హీరోస్ లో నాగ శౌర్య కూడా ఒకడు. మరి శౌర్య అయితే రీసెంట్ గా కృష్ణ వ్రిందా విహారి తూ డీసెంట్ కం బ్యాక్ అందుకోగా నిన్ననే తన నుంచి అయితే మరో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. తన కెరీర్ లో 24వ సినిమా ఇది కాగా ఎస్ ఎస్ అరుణాచలం అయితే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి సౌత్ ఇండియా స్టార్ అండ్ టాప్ సంగీత దర్శకుడు అయినటువంటి హరీష్ జై రాజ్ సంగీతం అందివ్వనున్నట్టు మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇది మాత్రం ఈ చిత్రం ఓ బిగ్ ప్లస్ అని చెప్పాలి. హరీష్ మ్యూజిక్ కోసం సౌత్ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాకి అయితే తాను ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి వైష్ణవి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు