ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డులు అందుకోగా ఈ చిత్రం సంగీతం విషయంలో జరిగిన సస్పెన్స్ కోసం అందరికీ తెలిసిందే. మెయిన్ గా దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ ఒకింత డిజప్పాయింట్ అయ్యారు.
అయితే సినిమాకి తన ప్లేస్ లో ఇతర సంగీత దర్శకులు పేర్లు తీసుకురావడం తన ఫ్యాన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ సినిమా వచ్చాక మాత్రం దాదాపు తన స్కోర్ కే క్రెడిట్ దక్కింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయగా ఇందులో అన్ని ట్రాక్స్ క్రెడిట్ దేవిశ్రీప్రసాద్ కే ఉండగా వాటిలో హైలైట్ ట్రాక్స్ తనవే కావడంతో పుష్ప 1 కంటే మించి అప్లాజ్ ఈ చిత్రం విషయంలో దక్కింది. దీనితో తన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి