‘అల వైకుంఠపురములో’.. కేరళ స్పెషల్ షోలు !

Ala Vaikunthapuramulo1

అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలన్నీ తెలుగుతో పాటు కేరళలో కూడా రిలీజ్ అవుతుంటాయి. కాగా బన్నీ – త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ కూడా కేరళలో జనవరి 12మా విడుదల కానుంది.
అయితే కేరళ ఫ్యాన్స్ కోసం 12వ తేదీ తెల్లవారుజామునే కేరళ రాష్ట్రవ్యాప్తంగా 30 ప్లాన్ బేస్డ్ షోలు వేయనున్నారు. దీనిబట్టి కేరళ రాష్ట్రంలో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉందని అర్ధమవుతుంది.

కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version