పవన్ సినిమాలో స్పెషల్ ఫైట్ సీక్వెన్స్ !
Published on Oct 31, 2017 9:18 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే అంశాల్లో ఫైట్స్ కూడా ఉంటాయి. సినిమాలోని మిగత అంశాలు ఎలా ఉన్నా పోరాట సన్నివేశాలు మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విధంగా ఉండేలా చూసుకుంటారు పవన్. ఇక త్రివిక్రమ్ తో కలిసి చేసే సినిమాలో అయితే ఫైట్స్ చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటాయి.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో కూడా ఇదే తరహా ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉందట. దీని కోసం పవన్ సుమారు రెండు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారట. కొత్తగా ఉండే ఈ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకే హైలేట్ గా నిలుస్తుందని టాక్. ఇటీవలే జరిగిన షెడ్యూల్లో ఈ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించారట. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook